బోనాలు పండుగ విశిష్టత మరియు పూజా విధానం.. ఆషాఢ బోనాల పండగ స్పెషల్ ఏంటి? ...

బోనం ఆచారాలు: ఆషాఢమాసంలో ఆడబిడ్డలను పుట్టింటికి తెచ్చుకుంటారు. ఇంటి ఆడబిడ్డ ఇళ్లకు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలిసిందే. ఆషాఢమాసంలో గ్రామ దేవత పుట్టింటికి వెళ్తుందని నమ్మకం. పుట్టింటికి వచ్చే గ్రామ దేవతకు తమ ఇళ్లల్లోకి సాదరంగా ఆహ్వానం పలుకుతారు భక్తులు. కూతురు ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతో, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. దీనిని ఊరడి అంటారు. కొన్ని చోట్ల పెద్ద పండుగ, వంటల పండుగ గా పిలుస్తారు. ఇదే కాలక్రమంలో బోనాలుగా మారింది. బోనాలు సమర్పించడానికి వెళ్లేటప్పుడు పోతురాజులు, శివసత్తుల విన్యాసాలతో నృత్యాలు చేస్తూ డప్పు చప్పుళ్లతో వెళ్తారు.

Comments