హనుమంతుని సంకల్పం లంకాపట్టణం అల్లకల్లోలం| Srimad Ramayanam Sundarakanda ...

#sundarakanda ,
#sriramayanam ,
#hanumananthudu ,

ఆంజనేయుడు పర్వకాల సముద్రంలా ఉప్పొంగిపోయాడు. దీర్ఘ దేహుడై విజృంభించాడు. అతని ముఖం ధూమం లేని అగ్నిలాగా ప్రకాశించింది. జాంబవంతునికీ, అన్య వానర ప్రముఖులకూ వందనం చేశాడు. అంగదుని ఆశీర్వదించి ఇలా అన్నాడు – మహనీయులారా! మా తండ్రికి సాటియైన నేను అవశ్యం సాగరాన్ని గోష్పదంలా లంఘిస్తాను. నా వేగానికి సాగరం అల్లకల్లోలం అవుతుంది. సీతమ్మను చూచి రామకార్యాన్ని నెరవేరుస్తాను. అవసరమైతే లంకా నగరాన్ని పెళ్ళగించుకువస్తాను. అనేక శుభశకునాలు అగుపడుతున్నాయి. మీరు నిశ్చింతగా ఉండండి. లంఘనా సమయంలో నా పద ఘట్టనకును భూమి తట్టుకోలేదు. కనుక ఈ మహేంద్రగిరిపైనుండి లంఘిస్తాను 


Comments