Kishkindhapuri Full Movie Review | Horror Thriller | Cinemaa lokam | Bel...
#kishkindhapurireview #bellamkondasrinivas #anupamaparameshwaran #cinemalokam
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన తొలి హారర్ చిత్రం ‘కిష్కింధపురి’. అనుపమ కథానాయిక. కాగా ఈ చిత్రం ఈ విడుదల అయింది.
మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
Movie & Cast:
చిత్రం: కిష్కింధపురి
నటీనటులు : బెల్లకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది, శ్రీకాంత్ అయ్యంగార్, శాండీ మాస్టర్, మర్కంద్ దేశ్‌పాండే, హినా భాటియా తదితరులు;
దర్శకుడు : కౌశిక్ పెగళ్లపాటి;
నిర్మాత : సాహు గారపాటి;
సంగీత దర్శకుడు : చైతన భరద్వాజ్;
సినిమాటోగ్రాఫర్ : చిన్మయ్ సలాస్కర్;
ఎడిటర్ : నిరంజన్ దేవరమనే;
Story:
రాఘవ్ (బెల్లంకొండ సాయిశ్రీనివాస్), మైథిలి (అనుపమ) ఇద్దరు ప్రేమలో ఉంటారు. పైగా ఇద్దరు కలిసి ఘోస్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ హౌసెస్ టూర్స్ చేస్తుంటారు. థ్రిల్ కోరుకునే వాళ్లందరినీ కలిపి ఓ పాడుబడిన బంగ్లాల్లోకి తీసుకెళ్లి అక్కడ దెయ్యాలు ఉన్నాయని నమ్మిస్తూ థ్రిల్ పంచడమే ఆ టూర్ ఉద్దేశం. అలా ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల ఆధారంగా కిష్కింధపురి అనే ఊరి పరిసరాల్లో ఉన్న సువర్ణమాయ అనే రేడియో స్టేషన్‌కి వెళ్తారు. 1989లోనే పాడుబడిన స్టేషన్ అది. అందులో దెయ్యం ఉంటుంది. ఇంతకీ, ఆ దెయ్యం ఎవరు ?, ఎందుకు అందర్నీ చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది ?, రాఘవ్ తన ప్రాణాల్ని అడ్డుపెట్టి దెయ్యానికి ఎందుకు ఎదురెళ్లాడు ? అనేది మిగిలిన కథ.
Rating: 3.2/5
Comments
Post a Comment