కొత్త ఆవకాయ్ పచ్చడి అమృతమే కాదు ఔషధం కుడా | Mango pickle in Telugu Taste.

ఊరగాయ దక్షిణ భారతదేశ ఆహార పదార్థం. దీనిని ఆవకాయ అని కూడా అంటారు.అనేక రకాల కాయల నుండి ఈ ఊరగాయలు తయారుచేస్తారు. ఈ ఊరగాయను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆవకాయ ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించినది, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వివిధ భారతీయ ఊరగాయలులో ఇది ఒకటి. ఆవకాయ కోసం కొట్టిన మామిడికాయల ముక్కలు. కాస్త పెద్ద అవకాయ అనుకోవచ్చును. ఆవకాయ ప్రధాన పదార్ధాలు మామిడికాయలు, ఆవాలు (ఆవాలు పొడి), పచ్చడి కోసం ఉపయోగించే ఇతర సుగంధ ద్రవ్యాల కలయికతో ఏర్పడుతుంది. ఈ కారంతో కూడిన ఊరగాయలకు దక్షిణ భారతీయులకు లోతైన అనుబంధం ఉన్నట్లు తెలుస్తోంది. మామిడికాయల ఊరగాయలు సాధారణంగా వేసవిలో తయారవుతాయి. ఇది ఆకుపచ్చ మామిడికాయల యొక్క గరిష్ఠ లభ్యత సమయంలో తయారు చేసుకుంటారు. ఆకుపచ్చని మామిడికాయలు, వేడి నూనె, మిరపకాయలు, కొన్ని సుగంధ ద్రవ్యాల రకాలు, కీలకమైన పదార్థాలుతో దీనిని తయారు చేస్తారు. తయారీ, నిల్వ, అందిస్తున్న ప్రక్రియ (తయారీ విధానం) దాదాపుగా ఒక సంప్రదాయంగా పరిగణించబడుతుంది. మామిడికాయలను ముందుగా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలను పొడి బట్టతో తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి బేసిన్ లేదా పళ్ళెం తీసుకొని దానిలో పైన చెప్పుకున్న కొలతలకు అనుగుణంగా ఆవపిండి, కారం, పసుపు, మెంతులు, చిన్న శనగలు వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఉప్పు మాత్రం అంతా ఒక్కసారే వేసుకోకుండా కొద్దిగా తగ్గించి వేసుకొని తర్వాత రుచి చూసి తక్కువైతే వేసుకోవచ్చు. ఈ మిశ్రమానికి తరిగిన ముక్కలు కలిపి దాని మీద కొద్దిగా నూనె కలిపి కొద్దిగా తడి పొడి అయ్యేటట్లు కలపాలి. మిగిలిన నూనెను పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని తడిలేని ఒక జాడీలో కొద్దిగా వేసి పెట్టుకోవాలి. జాడీలో ముక్కలు వేసే ముందు అడుగునా కొద్దిగా కారం మిశ్రమాన్ని వేసి ఆపైన ముక్కలు వేసుకోవాలి. కారం మిశ్రమం, పొడిలో కలిపిన మామిడి ముక్కలు జాడీలో పొరలు పొరలుగా వేసుకోవాలి. మొత్తం మిశ్రమం ఇలా జాడీలోకి సర్దుకుంటూ చేయాలి. మిగిలిన నూనెను జాడీలోని పచ్చడిపైన ముక్కలకు కనీసం అంగుళం పైన నూనె ఉండేలా పోసుకోవాలి. జాడీ మీద పడిన కారాన్ని పొడిబట్టతో తుడిచి మూత పెట్టి మరొక పొడి బట్టతో జాడీకి మూతను సరిగా పెట్టి జాడీ మూతిని గట్టిగా కట్టేయాలి. ఈ జాడీని నీళ్లు, తేమ లేని వంటగదిలో శుభ్రంగా ఉన్న ఒక చోట పెట్టాలి. మూడు రోజుల తర్వాత బాగా ఊట వస్తుంది. జాడీలోని ఆవకాయను ఒక పెద్ద పళ్లెంలోకి తీసుకొని బాగా పెద్ద గరిటతో కలపాలి. కొద్దిగా రుచి చూసి కారం, ఉప్పు, ఆవ పిండి ఏది తక్కువ అనిపించినా మరికొంత కలుపుకోవచ్చు. తిరిగి ఆవకాయను జాడీలోకి జాగ్రత్తగా మార్చుకోవాలి. జాడీ పైన మూత పెట్టి జాగ్రత్త చేయాలి. #mangopickle , #avakayapachadi , #uragaya , #mamudiuragaya , #avakai, #avakaipachadi, #pachadi , #mavudikayapachadi , #sravaniskitchen , #wahchef , #mamidikayapachadi , #ammachethivanta , #mango , #mangorecipe , #rawmango , #mangopickle , #mangopicklerecipe , #mangopickleintelugu , #mangopickles , #avakayapachadiintelugu , #rawmangopickle , #avakaya , #avakayapachadi , #avakaipickle , #avakaipicklerecipe , #summer , #summerrecipes , #summerspecialrecipe , #summerspecial , #andhraavakaya , #mangopachadi , #pachadi , #pickle ,

Comments