Ramayanam Kishkindakanda part -1 | శ్రీమద్రామాయణం కావ్యంలో హనుమంతుడి రా...

కిష్కింధ కాండ లేదా కిష్కింధాకాండము (Kishkindha Kanda) రామాయణం కావ్యంలో నాల్గవ విభాగం. హనుమంతుడు రామ లక్ష్మణులను కలసికొనుట అడవిలో రామ లక్ష్మణులను చూచిన హనుమంతుడు. రామ లక్ష్మణులు శబరి ఆతిధ్యాన్ని స్వీకరించిన తరువాత పంపాసరోవరం అందాలను చూస్తూ ముందుకు సాగారు. విలపిస్తున్న రామునికి లక్ష్మణుడు ధైర్యం చెప్పాడు. క్రమంగా వారు ఋష్యమూక పర్వతాన్ని సమీపించారు. తన అన్న వాలి కోపానికి గురై తరిమి వేయబడిన సుగ్రీవుడనే వానరుడు తనవారితో కలసి ఆ పర్వతం పైననే సంచరిస్తున్నాడు. మహా ధనుర్ధారులైన రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయం చెందాడు. వారిని గురించి తెలిసికోమని హనుమంతుని పంపాడు. హనుమంతుడు బ్రహ్మచారి రూపంతో వారిని సమీపించి – ఓ పుణ్యపురుషులారా! తమరు వేషధారణను బట్టి తాపసులవలెనున్నారు. ధరించిన ఆయుధాలను బట్టి సర్వ శత్రు సంహారణాదక్షుల వలె ఉన్నారు. నర నారాయణుల వలెను, సూర్యచంద్రులవలెను, అశ్వినీ దేవతలవలెను కనుపిస్తున్నారు. నేను సుగ్రీవుడనే వానరుని మంత్రిని. అతడు తన అన్న ఆగ్రహానికి గురై దీనుడైయున్నాడు. మీ స్నేహాన్ని కోరుతున్నాడు. నేను కామరూపుడను గనుక వటువు వేషంలో మిమ్ములను కలవ వచ్చాను. తమ పరిచయ భాగ్యాన్ని ప్రసాదించండి అని మృదువైన మాటలతో అన్నాడు. #hanuman , #ramayanam , #kishkindakanda , #kishkindhakaand , #kishkindakand , #sugriva , #hanumantha , #vali , #rusyamukam , #ramanarayanam , #teluguramayanam , #valmikiramayanam , #valmiki , #tara , #sugrivamaitri , #chaganti , #chagantikoteswararao , #chagantipravachanalu , #garikapati , #garikipatipravachanam , #namburi , #namburipravachanam , #nandurisrinivas , #nandurisrinivaslatestvideos , #samavedamshanmukhasarma , #telugupravachanalu ,

Comments