sri valmiki ramayanam aranyakanda Vol 7 | శ్రీమద్రామాయణం కావ్యంలో కబంధు...

కబంధుని శాప విమోచన రామ లక్ష్మణులకు తన వృత్తాంతమును వివరిస్తున్న కబంధుడు. మతంగాశ్రమం సమీపంలో వారికి కబంధుడనే మహాకాయుడైన ఒక రాక్షసుడు ఎదురుపడ్డాడు. వాడికి తలా మెడా కూడా లేవు. వాని ముఖం కడుపుమీద ఉంది. వాడి చేతులు ఆమడ పొడవున్నాయి. శరీరం పర్వతంలా ఉంది. అతడు శాపవశాన రాక్షసుడైన గంధర్వుడు. వాడు తన చేతులతో రామలక్ష్మణులను ఒడిసి పట్టి తినబోయాడు. రామలక్ష్మణులు వాడి చేతులు నరికేశారు. తన శాపాన్నించి విముక్తి కలిగించే రామలక్ష్మణులు వారేనని కబంధుడు గ్రహించాడు. అతని కోరికపై వారు అతని శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశారు. అప్పుడు కబంధుడు సకలాభరుణుడైన గంధర్వుడై హంసల విమానంలో ఆకాశానికి వెళుతూ – రామా! ప్రస్తుతం నీవు దుర్దశాపన్నుడవు. నీవు సుగ్రీవునితో స్నేహం చేసుకొంటే సీతను వెదకడంలో అతను నీకు సహాయపడతాడు. పంపా సరస్సుకు పశ్చిమాన మాతంగముని ఆశ్రమంలో నీకోసం వేచి ఉన్న శబరికి నీ దర్శనం ప్రసాదించు. తరువాత ఆవల ఉన్న ఋష్యమూక పర్వతంపై సుగ్రీవుని కలుసుకోవచ్చు. అతని స్నేహంతో రాక్షసులనందరినీ సంహరించి నీ జీవితేశ్వరిని పొందగలవు అని చెప్పాడు. #aranyakanda , #kabandhudu , #sabari , #kabandhunishapam , #sabarimaa , #munivatika , #kabandungan , #ramanarayanam , #valmikiramayanam , #ramadevotional , #srimadramayanam , #chaganti , #changantipravachanam , #chagantikoteswararao , #chagantipravachanalu , #namburi , #namburipravachanam , #namburipravachanalu , #garikapati , #samavedamshanmukhasharma , #samavedamshanmukhasarma , #garikipatinarasimharaopravachanalu , #garikipatipravachanam ,

Comments