సర్వ పాపాలను హరించే కామిక ఏకాదశి కథ, వ్రత విశిష్టత | Kamika Ekadasi Sig...
* కామికా ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందు నిద్ర లేచి తలస్నానం చేయాలి.
* అనంతరం ఉతికిన బట్టలు వేసుకుని, ఇంట్లో పూజా గదిని శుభ్రమైన నీటితో శుభ్రం చేయాలి.
* ఒక ఎర్రని వస్త్రంపై విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్టించాలి.
* ఆ తర్వాత శ్రీహారికి పువ్వులు, పండ్లు, తులసిని సమర్పించాలి.
* అనంతరం దీపారాధన చేసి, కామికా ఏకాదశి వ్రతం కథ, మంత్రాలను చదవాలి.
* చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి.
* ఈరోజంతా ఉపవాసం ఉండాలి. మరుసటి రోజు ఉపవాసాన్ని విరమించాలి.
* ఇలా చేయడం వల్ల శ్రీహరి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతారు.
ఎవరైతే తమ జీవితంలో తెలియకుండా తప్పులు చేస్తారో.. వాటి నుంచి ఇబ్బందులు పడే వారంతా కామిక ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. ఈ పవిత్రమైన రోజున శ్రీహరిని పూజించడం వల్ల మన పూర్వీకులు సంతోషిస్తారని, వారి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. పూర్వీకుల ఆశీస్సులు పొందిన వ్యక్తి జీవితంలో సంపద, ఆనందం, శ్రేయస్సు కచ్చితంగా పొందుతారు.
Comments
Post a Comment