శ్రావణ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, కావలసిన పూజ సామగ్రి, వ్రతం కథను వినాలి ...


వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత.. పరమేశ్వరుడు, పార్వతికి చెప్పిన గాథ..! వరలక్ష్మీ వ్రతం.. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు, అమ్మవారి అనుగ్రహం! భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అనే అర్థం కూడా ఉంది. శ్రీవరలక్ష్మి పూజ సామగ్రి.. పసుపు, కుంకుమ, గంధం, విడిపూలు, పూల మాలలు, అవు పాలు తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, అగరవత్తులు, కర్పూరం, చిల్లర పైసలు, తెల్లని వస్ర్తం, రవికల గుడ్డ, మామిడి ఆకులు, ఐదు రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కలశం, కొబ్బరి కాయలు, తెల్ల దారం లేదా నోము దారం లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో తయారుచేసిన నైవేధ్యాలు,బియ్యం, పంచామృతాలు. దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి.

Comments