శ్రీ కృష్ణ జన్మాష్టమి విశిష్టత | Sri Krishna Janmashtami pooja vidhanam ...
శ్రీ కృష్ణ జన్మాష్టమి విశిష్టత | Sri Krishna Janmashtami
ద్వాపరి యుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణం మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దేవకీ వసుదేవులకు అష్టమ(8వ) సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణావతారాన్ని శ్రీమహావిష్టువు ఎనిమిదో అవతారంగా పురాణాల్లో చెప్పుకుంటారు. శ్రీమహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణావతారం విశిష్టమైనది. అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథినే ‘కృష్ణాష్టమి’గా జరుపుకుంటారు. కృష్ణాష్టమిని జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. ఈ పండుగ రోజున ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసి షోడశోపచారాలతో కృష్ణుడికి అర్చన చేస్తారు. ఆయనకు ఎంతో ఇష్టమైన అటుకులు, వెన్న, పాలు, పెరుగు, మీగడ మొదలైనవన్నీ నైవేద్యంగా సమర్పిస్తారు.
Comments
Post a Comment